వైభవ్‌కు కొత్త రోల్.. టీమిండియా మాస్టర్ ప్లాన్ రెడీ!

వైభవ్‌కు కొత్త రోల్.. టీమిండియా మాస్టర్ ప్లాన్ రెడీ!

Vaibhav Suryavanshi: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులను తిరగరాశాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో వైభవ్‌ను టీమిండియా భవిష్యత్తు ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయా అనే అంశంపై భారత జట్టు తాత్కాలిక స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. 

హరారే స్టేడియంలో సూర్యవంశీలో మరో యాంగిల్: 
హరారే స్టేడియం వైభవ్ సూర్యవంశీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.. ఎందుకంటే తొలి టీ20లో హాఫ్ సెంచరీ కొట్టడంతో పాటు గతంలో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఇదే మైదానంలో 175 రన్స్ తో కిరాక్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో పార్ట్-టైమ్ స్పిన్ బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. దీంతో చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మార్చాలనే ఆలోచనలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

సునీల్ జోషి రియాక్షన్.. ప్రస్తుతానికి బ్యాటింగ్‌పైనే దృష్టి: 
వైభవ్‌ సూర్యవంశీని ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలపై తాత్కాలిక స్పిన్ కోచ్ సునీల్ జోషి మాట్లాడుతూ.. 15 ఏళ్ల కుర్రాడి విషయంలో తొందరపడకుండా నిదానంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి అతడి బ్యాటింగ్‌పైనే ముఖ్యంగా దృష్టి పెట్టాం.. వైభవ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది.. ఈ గ్రౌండ్ అతనికి చాలా బాగా కలిసివస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇక్కడ మంచిగా రాణించాడు. సమయం దొరికినప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో అతడి బౌలింగ్‌పై పని చేస్తామని జోషి వెల్లడించారు.  

ఆల్‌రౌండర్ల కోసం టీమిండియా అన్వేషణ: 
టీ20ల్లో ఆల్‌రౌండర్లు జట్టులో ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఆల్‌రౌండర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం భారత జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో పాటు వైభవ్ సూర్యవంశీ కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవాడే.. ఈ యంగ్ బ్యాటర్లు బౌలింగ్‌లోనూ నిలకడగా రాణిస్తే జట్టు కాంబినేషన్ మరింత బలంగా మారుతుంది. ఫలితంగా రింకూ సింగ్ వంటి ఫినిషర్లకు తుది జట్టులో క్రమం తప్పకుండా చోటు లభించే ఛాన్స్ ఉంటుంది.