దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది... ఢిల్లీలో విద్యార్థుల నిరసనలే నిదర్శనం: ఆర్ నారాయణ మూర్తి

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది... ఢిల్లీలో విద్యార్థుల నిరసనలే నిదర్శనం: ఆర్ నారాయణ మూర్తి

దేశం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాయబడుతున్నాయని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ( జులై 25 ) హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పరకాల నాగన్న సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర పాలకుల విధానాల కారణంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నక్సల్స్ రహిత భారత్‌ గా మార్చామని చెప్పుకుంటున్న అమిత్ షా, చిత్తశుద్ధి ఉంటే దేశాన్ని దోపిడీ రహిత భారతంగా మార్చాలని సూచించారు. 

కార్మికులు, రైతులతో పాటు విద్యార్థులు సైతం తమ హక్కుల కోసం రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

►ALSO READ | క్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై సీజేపీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్.. పోలీసులు కొట్టిన ఫొటోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోడ్ చేయాలని పిలుపు

పరకాల నాగన్న తన పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచారని కొనియాడారు నారాయణమూర్తి . తన సినిమాల్లోని పాటలకు ఆయన ప్రాణం పోశారని... వ్యక్తిగత ప్రయోజనాల కంటే కమ్యూనిస్టు పార్టీనే ముఖ్యమని భావించిన పరకాల నాగన్న, తన పాటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైతం పార్టీ ఫండ్‌గా అందించేవారని అన్నారు. 

పాలకులను ప్రశ్నించే కళాకారులు సమాజానికి ఎంతో అవసరమని.. పరకాల నాగన్న స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా నిలిచి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని అన్నారు నారాయణమూర్తి.