బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ ఆకాశానికి ఎగిశాయి. నిన్న మొన్నటి దాకా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు ఈ రోజు(జులై 25) మళ్ళీ పెరిగాయి. దింతో గ్రాము ధర రూ.45 నుండి రూ.60 వరకు పెరిగింది. దింతో 1 గ్రాము 24క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరిగి రూ.14,493కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.55 పెరిగి రూ.13,285, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 45 పెరిగి రూ.10,870 చేరింది.
ముడి చమురు నుండి బంగారం, వెండి వరకు అన్నింటి ధరలపై మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధర 140 డాలర్లకు కొద్దిగా పైన ట్రేడవుతోంది.
బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు ప్రస్తుతం అమెరికా సాగిస్తున్న రెండు విధాల యుద్ధమే ప్రధాన కారణమని కమోడిటీ నిపుణులు అంటున్నారు. మొదటిది, ఇరాన్‌తో యుద్ధం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా నష్టం కలిగిస్తుండగా, రెండవది వాణిజ్య యుద్ధం వ్యాపారాన్ని మరింత ఖరీదైనదిగా మారుస్తోంది. అమెరికా వరుసగా 14వ రోజు కూడా ఇరాన్‌పై దాడులను కొనసాగించగా, భారతదేశంతో సహా 60 దేశాలపై కొత్త సుంకాలను విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్వంద్వ వైఖరి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఒడిదుడుకులకు దారితీసింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలలో ధరలు చూస్తే :
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930, 22 క్యారెట్ల ధర రూ.1,32,850, 18 క్యారెట్ల ధర రూ.1,08,700.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930, 22 క్యారెట్ల ధర రూ.1,32,850, 18 క్యారెట్ల ధర రూ.1,08,700.
ఇక వెండి ధరలు చూస్తే ఈ రోజు(25 జూలై 2026) 1 గ్రాము రూ.5 పెరిగి రూ.240కి చేరగా.. కిలోకి రూ.5 వేలు పెరిగి రూ.2,40,000.
