అర్హులందరి ఓట్ల నమోదుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

అర్హులందరి ఓట్ల నమోదుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి బూత్‌‌‌‌‌‌‌‌లోనూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా నాయకులు, బీఎల్ఏలు, బూత్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆరు మండలాల బీఎల్ఏలు, బూత్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రతి ఇంటిని సంప్రదించి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి చేసిన నాయకులను, బీఎల్ఏలను ఆయన అభినందించారు.