కామారెడ్డి జిల్లాలో రైతు భరోసా నిధుల గోల్ మాల్.. ఏఈవో సస్పెండ్...

కామారెడ్డి జిల్లాలో రైతు భరోసా నిధుల గోల్ మాల్.. ఏఈవో సస్పెండ్...

కామారెడ్డి జిల్లాలో ఏఈవో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టించడంతో ఏఈవో మౌనికపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన కాట్రోత్ కిషన్ అనే గిరిజన రైతుకు చెందిన ఎకరం రెండు గుంటల భూమి ఉంది.. ఈ భూమికి సంబంధించిన రైతు భరోసా నిధులు గత కొన్ని సంవత్సరాలుగా అకౌంట్లో జమ కావడం లేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు రైతు కిషన్. 

కిషన్ ఫిర్యాదుతో విచారణ చేపట్టారు అధికారులు. విచారణ అనంతరం ఏఈవో మౌనిక బ్యాంకు అకౌంట్ లో 90 వేలు జమైనట్లుగా గుర్తించిన అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.