కడుపుబ్బా నవ్వించేందుకు నేను రెడీ 

కడుపుబ్బా నవ్వించేందుకు నేను రెడీ 

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’.  కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా తాజాగా ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ‘కొంచెం కొంచెం’  సాంగ్  రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది.  రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, సమీరా భరద్వాజ్  పాడిన తీరు ఆకట్టుకున్నాయి. 

ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు  దర్శకుడు బాబీ, నిర్మాత కేఎల్ నారాయణ అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. హవీష్ మాట్లాడుతూ ‘నిజానికి నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు  నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే  చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ అయ్యాను. ప్రేక్షకులను కూడా కడుపుబ్బా నవ్విస్తుంది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.  

ఈ సినిమా నుంచి ఇంకా ఎన్నో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌లు రాబోతున్నాయని  హీరోయిన్  కావ్య  థాపర్ చెప్పింది.  దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. ఈ పాట సినిమాలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ టీమ్ అందరికీ సినిమా చూపించాం.  మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని చెప్పాడు. ఈ చిత్రం కుటుంబం మొత్తం కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు అన్నారు.