నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్రెడ్డి తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కవర్ షెడ్, మీటింగ్ హాల్, సీసీ పేవ్‌మెంట్ నిర్మాణాలతో పాటు తెలకపల్లి మండల కేంద్రంలోని సబ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో మౌలిక వసతులు మెరుగుపడటం వల్ల రైతులు తమ ఉత్పత్తులను సౌకర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం కలుగుతుందని, రైతులకు, వ్యాపారులకు, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
