శ్రీరామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ది మేజ్ 

శ్రీరామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ది మేజ్ 

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’.   ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో  డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ లుక్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తుండగా, వారి బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో  ఒక మహానగరాన్ని చూపించారు. అందరూ  బ్లాక్ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇదొక  న్యూ ఏజ్ కమర్షియల్ థ్రిల్లర్ అని, ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు.