ఏపీలోని పెన్నా నది ది ఒక విచిత్ర పరిస్థితి. రాష్ట్రంలో ఇతర నదులన్నీ పొంగిపొర్లుతున్నప్పటికీ.. పెన్నా నదిలో మాత్రం నీరు ఉండదు. అందుకే పెన్నా నదిని పీనుగల నది అని కూడా పిలుస్తారు. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో పెన్నా నదిలో నీరు కనిపించడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు రుతుపవనాలు కూడా రాకముందే పెన్నా ఉదృతంగా ప్రవేశిస్తోంది. అది కూడా కరువు జిల్లా అనంతపురంలో.
నైరుతి రుతుపవనాలకు ముందే అక్కడక్కడా ఈదురురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురంలోని కళ్యాణదుర్గం ప్రాంతంలో పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇది చాలా అరుదైన సీన్. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు జనం కల్యాణదుర్గనికి పోటెత్తుతున్నారు.
►ALSO READ | శ్రీశైలం సుండిపెంట డిగ్రీ కాలేజీ దగ్గర కారు దగ్ధం... ఓవర్ హీట్ తో ఇంజిన్ లో మంటలు...
కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో నంది కొండల్లో పుట్టిన పెన్నా నది పరిగి మండలం సమీపంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కర్ణాటకలోని పావగడ మీదుగా తిరిగి కళ్యాణదుర్గం ప్రాంతానికి ప్రవేశిస్తుంది. కర్ణాటక అధిక వర్షాలు కురిసినా కూడా పెన్నా నది నీటిధారలా మాత్రమే ఉంటుంది. కానీ.. ఇప్పుడు పెన్నా ఉప్పొంగి ప్రవహిస్తున్న అనంతపురం జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
