Usman Tariq Bowling Action: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) టోర్నమెంట్లో పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మరోసారి వివాదాస్పదమైంది. జులై 24 (శుక్రవారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. తారిక్ 'చకింగ్' (చట్టవిరుద్ధమైన రీతిలో బంతిని విసరడం) చేస్తున్నాడని ఆరోపిస్తూ మైదానంలో అంపైర్‌తో గొడవకు దిగాడు.
మైదానంలో అసలేం జరిగింది?:
ఈ మ్యాచ్‌లో 215 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ డేవిడ్, కేవలం 3 బంతుల్లో 2 రన్స్ చేసి తారిక్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టీమ్ డేవిడ్ పెవిలియన్ చేరిన వెంటనే మైదానాన్ని వీడని డేవిడ్, అంపైర్ దగ్గరకు వెళ్లి తారిక్ బౌలింగ్ శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ, ఆన్-ఫీల్డ్ అంపైర్ తారిక్ యాక్షన్‌లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేయడంతో డేవిడ్ మైదానం వీడాడు. ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ 10 రన్స్ తేడాతో విజయం సాధించగా, తారిక్ 20 బంతుల్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
తారిక్ బౌలింగ్ పై కామరాన్ గ్రీన్, డారిల్ మిచెల్ విమర్శలు:
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ సమయంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్, అలాగే ఐఎల్ టీ20 (ILT20 2025-26) టోర్నీలో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ కూడా తారిక్ బౌలింగ్ శైలి 'చకింగ్'లా ఉందని బహిరంగంగానే ప్రశ్నించారు.
ఉస్మాన్ తారిక్ వివరణ:
ఉస్మాన్ తారిక్ స్లింగింగ్ యాక్షన్‌తో పాటు రన్-అప్‌లో ఒక్క క్షణం ఆగి బౌలింగ్ చేసే వినూత్న శైలిని కలిగి ఉన్నాడు. కానీ, తనకు ఉన్న ప్రత్యేకమైన వైద్యపరమైన పరిస్థితి (Medical Condition) వల్ల చేతిలో రెండు మోచేతులు (two elbows) ఉన్నట్లు అనిపిస్తుందని, అందుకే తన యాక్షన్ అలా కనిపిస్తుందని తారిక్ గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ, అంతర్జాతీయ స్టార్ బ్యాటర్లు వరుసగా ఆయన బౌలింగ్‌పై ప్రశ్నలు గుప్పిస్తుండటంతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
Tim David becomes the latest player to question Usman Tariq's bowling action. pic.twitter.com/v72MgIHrqN
— Sheri. (@CallMeSheri1_) July 25, 2026
