శ్రీశైలం మండలం సుండిపెంటలో అగ్నిప్రమాదం జరిగింది. సుండిపెంట డిగ్రీ కాలేజీ దగ్గర కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమయ్యింది. ఆదివారం ( జూన్ 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న కారు సుండిపెంట డిగ్రీ కాలేజీ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కారులో మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన ఆపాడు. దీంతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడం వల్లే కారులో మంటలు చెలరేగినట్లు సమాచారం.భారీగా మంటలు ఎగిసిపడటంతో కారు పూర్తిగా దగ్దమయ్యింది.
ఎండాకాలంలో దూరప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని.. వాహనాల ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. వాహనాలు మెయింటెనెన్స్ క్రమం తప్పకుండ చేయించాలని సూచిస్తున్నారు.
