బియ్యం అక్రమ రవాణా చేస్తు్న్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా కఠిన చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం అక్రమరవాణా చేస్తున్న వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు జైలుకు పంపుతోంది. సిద్దిపేట జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన బచ్చు రత్నాకర్ అనే వ్యక్తిని అక్రమంగా బియ్యం తరలిస్తున్న కేసులో పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు . బియ్యం అక్రమ చేస్తున్న రత్నాకర్ గతంలో ఆరుసార్లు పోలీసులకు చిక్కాడు. అయిన తన తీరు మార్చుకోకుండా మళ్లీ బియ్యం అక్రమ రవాణా చేస్తూ మరోసారి పోలీసులకు దొరికాడు. రేషన్ లబ్దిదారులు, డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి వడ్డేపల్లి రైస్ మిల్లులో నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతనిపై పీడీయాక్టు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం చర్లపల్లి జైలు కు తరలించారు.
