వేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు

వేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు

కరీంనగర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రెండు దఫాలుగా 150 కోట్లు కేటాయించిన తెలంగాణప్రభుత్వం..తాజాగా  మరో వందకోట్లు రిలీజ్ చేసింది.  

రాజన్న ఆలయ అభివృద్ది్కి మొత్తం 249 కోట్లు కేటాయించింది రాష్ట్రప్రభుత్వం.  అయితే ఇప్పటికే 2024 బడ్జెట్ లో 50 కోట్లు, 2025 -26 బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. శనివారం (జూలై 25)  మరో 99.40 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో వేముల రాజరాజేశ్వర స్వామి ఆలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 45 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆలయ అభివృద్ది కినిధుల కేటాయించడం పట్ల రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు నిధులు మంజూరు చేసిన  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నo ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు .