ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: సీజేపీ స్పోక్స్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు

ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: సీజేపీ స్పోక్స్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు

కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెన్ జెడ్ సాధించిన విజయం కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్నారు. దేశ యువత మేల్కొంది, దేశంలోని సమసలన్నింటిని వారే పరిష్కరిస్తారు, ఒక పార్టీగా, ఉద్యమంగా ఇది ఇక్కడితో ఆగిపోదని అన్నారు. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో  యువత దేశవ్యాప్తంగాపర్యటిస్తుందన్నారు. అందరినుంచి జవాబుదారీ తనం డిమాండ్  చేస్తూనే ఉంటుందని క్లియర్ కట్ గా చెప్పారు సౌరవ్ దాస్. 

శనివారం  పలు కీలక నిర్ణయాలకు దేశ రాజధాని ఢిల్లీ వేదికైంది.  నీట్  పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా  చేశారు.  నెలరోజులుగా నిరసనలు తెలుపుతున్న కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జన్ జెడ్  డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి వారి షరతులకు హామీ ఇచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీంతో పాటు  నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో  కాక్రోచ్ పార్టీ నిరసననలు విరమించింది. దేశవ్యాప్తాంగా యువత సంబురాలు చేసుకున్నారు. 

మరోవైపు జెన్ జెడ్ నిరసనలకు  మద్దుతుగా నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్ కేంద్ర ప్రకటనతో దీక్ష విరమించారు.  విద్యావ్యవస్థలో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే జెన్ జెడ్ ప్రతినిధి సౌరవ్ దాస్ .. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. యువతను అడిగి తెలుసుకుంటాం,  వారి పరిష్కారానికి కృషి చేస్తామని, బాధ్యులనుంచి జవాబుదారీ తనం డిమాండ్ చేస్తామని ప్రకటించారు.