తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్... ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై విచారణ...

తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్... ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై విచారణ...

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. విచారణాధికారిగా బీ. ఉమామహేశ్వరరావును నియమిస్తూ శనివారం ( జులై 25 ) ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావును నియమించింది.సిట్ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలో అధికారుల వివరణల అనంతరం పూర్తి స్థాయి విచారణ జరగనుంది. విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. శ్రీవైష్ణవి డైరీలో లంచాల చెల్లింపుల వివరాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నెలవారీ మామూళ్ల వివరాలు డైరీలో నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. లైసెన్సులు, నవీకరణల్లో అక్రమాలపై ఆరోపణల క్రమంలో ఏడుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం.

కరి పరమేశ్వరరావు సహా ఏడుగురిపై విచారణ:

  • ఎన్. శివశంకరరెడ్డి (ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్).
  • బి. రమేష్‌బాబు (విశ్రాంత ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్).
  • మేడిచెర్ల సత్యనారాయణ (బాయిలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్).
  • ఎంవీఎల్ నరసింహరాజు (బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్).
  • టి. సుబ్బయ్య,
  • పి. రాంబాబు

నెయ్యి సరఫరా వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేయాలని... మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం.