ఒంగోలు: కరేడు భూ నిర్వాసితులకు అండగా బహుజన పోరాటం..న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదు: జె.పూర్ణచంద్రరావు

ఒంగోలు: కరేడు భూ నిర్వాసితులకు అండగా బహుజన పోరాటం..న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదు: జె.పూర్ణచంద్రరావు

ఒంగోలు: కరేడు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, యానాదులు, ఎరుకలు, యాదవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఒంగోలులో నిర్వహించిన “బహుజన మాట - బహుజన పాట” సభకు వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. జూమ్ ద్వారా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. కరేడులో వేల ఎకరాలను ఇండోసోల్ సంస్థకు కేటాయించడం వల్ల చిన్న రైతులు నిర్వాసితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను పూర్తిగా కంపెనీలకు ఇవ్వకుండా, లీజు విధానం అమలు చేయాలని, పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు అమరావతి రైతులా అభివృద్ధి చెందిన భూముల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త బక్కా పరంజ్యోతి మాట్లాడుతూ కరేడు నిర్వాసిత కుటుంబాలకు ట్యాంక్ పోరంబోకు భూములు కేటాయించి, శాశ్వత పునరావాసం కల్పించాలన్నారు. ఏఐబీఎస్పీ ఏపీ అధ్యక్షుడు లేక రాజారావు మాట్లాడుతూ పోలవరం ఆదివాసీలకు 'భూమికి భూమి, జీవనానికి జీవనం' సూత్రం అమలు చేయాలని డిమాండ్​చేశారు. బీసీ సమన్వయ వేదిక అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ తక్షణమే తేవాలన్నారు.  బీసీ టైమ్స్ సంపాదకుడు సూర్యారావు మాట్లాడుతూ124 బీసీ కులాలకు ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం విచారకరమన్నారు. పేరం సత్యం, న్యాయవాది అజీజ్, వెంకటస్వామి, శ్రీరాములు, ఎన్.ఏ.డి. పాల్, కిషోర్, డేనియల్, దివి ఉమా లక్ష్మి, పొట్లూరి దేవి పాల్గొన్నారు.