కేబినెట్ సబ్ కమిటీల్లో మంత్రి అడ్లూరికి చోటు

కేబినెట్ సబ్ కమిటీల్లో మంత్రి అడ్లూరికి చోటు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ, రోహిత్ వేముల బిల్లులపై అమల్లో ఉన్న కేబినెట్ సబ్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కు స్థానం కల్పించారు. ఈ మేరకు శనివారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నాయకత్వంలో ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు వివక్ష నుంచి రక్షణ కల్పించేలా రోహిత్ వేముల బిల్లును ఆదర్శవంతమైన చట్టంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోహిత్ వేముల చట్టంలో సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి ఉండగా, మంత్రులు ఉత్తమ్, దామోదర, పొన్నం, శ్రీధర్ బాబులు సభ్యులుగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల్లో మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా ఉండగా మంత్రి పొన్నం మెంబర్ గా ఉన్నారు.