నకిలీ పాస్‌‌పోర్ట్‌‌ తో యూఎస్ వీసాకు యత్నం..నిజామాబాద్ జిల్లా వ్యక్తి అరెస్ట్

నకిలీ పాస్‌‌పోర్ట్‌‌ తో యూఎస్ వీసాకు యత్నం..నిజామాబాద్ జిల్లా వ్యక్తి అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: యూఎస్ వీసా కోసం నకిలీ పాస్‌‌పోర్ట్ సమర్పించిన నిజామాబాద్ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మెరుగు రమణగౌడ్ (46) యూఎస్ బీ1/బి2 విజిటర్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 

ఈ నెల 24న గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్‌‌లో అధికారుల ఎదుట హాజరైన అతను.. తన ఇండియన్ పాస్‌‌పోర్ట్‌‌తోపాటు సోదరుడు మెరుగు మహేందర్‌‌గౌడ్ పేరుతో ఉన్న యూఎస్ పాస్‌‌పోర్ట్ జిరాక్స్ కాపీని సమర్పించాడు. 

అనుమానం వచ్చిన కాన్సులేట్ అధికారులు విచారణ జరపగా.. ఆ పాస్‌‌పోర్ట్ నకిలీదని తేలింది. రాజు అనే ఏజెంట్ తనకు ఆ కాపీని ఇచ్చినట్లు రమణగౌడ్ తెలిపాడు. కాన్సులేట్ రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్​బ్రియాన్ జిజాస్క్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, రమణగౌడ్‌‌ను అరెస్ట్ చేశారు. అలాగే, అతని సోదరుడు మహేందర్‌‌గౌడ్‌‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.