వేములవాడ రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు

వేములవాడ రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు

వేములవాడ, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిధులతో మొత్తం రూ.249.40 కోట్లకు చేరుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దశలవారీగా భారీ నిధులు కేటాయిస్తున్నారు. 

2023–24 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.50 కోట్లు, 2024–--25 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.100 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే సుమారు 45 శాతం పనులు పూర్తి కాగా,  తాజాగా విడుదలైన నిధులతో మిగిలిన నిర్మాణాలు, మౌలిక వసతుల పనులను వేగవంతం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.  నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.