ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ.2,278.14 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తూ జీవోను విడుదల చేసింది.
ఈ మహా స్వప్నం సాకారం కావడానికి విశేష కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, స్థానిక నాయకులు కంది శ్రీనివాస రెడ్డి కి , కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతున్నదని ఇటీవల రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ డిఫెన్స్ భూమి సుమారు 250 ఎకరాలు ఉండడం కలిసొచ్చే విషయమని పేర్కొన్నారు. అందువల్ల రక్షణ శాఖతో కలిసి ఈ ఎయిర్ పోర్ట్ను నిర్మించాలని చెప్పారు.ఫైనల్ గా రాజ్నాథ్ సింగ్ చొరవతో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముందుకు నడిపించాలని, రక్షణ శాఖ అధికారులు కూడా పాజిటి వ్ ప్రతిపాదనలు ఇచ్చారన్నారు.
ఈ ఎయిర్ పోర్టు 1,700 ఎకరాల భూమి కావాలంటే.. ఈ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. వీలైనంత త్వరగా భూసేకరణ చేసుకుంటే.. కచ్చితంగా అద్భుతమైన ఎయిర్ పోర్ట్ ఆదిలాబాద్ నిర్మితమవుతుందన్నారు. కేవలం సివిలియన్నే కాకుండా.. డిఫెన్స్ యాక్టివిటీస్కు సంబంధించిన ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆదిలాబాద్కు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలకు ఈ ఎయిర్ పోర్ట్.. డిఫెన్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్కు కూడా పౌర విమానయాన సంస్థ నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్కు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
