హైదరాబాద్: తెలంగాణ 20 క్రికెట్ లీగ్ వేలం రసవత్తరంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదిక జరుగుతోన్న ఈ వేలంలో మొదటగా ఐకాన్ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఐకాన్ కేటగిరీలో ఉన్న టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రయికర్స్ తిలక్ కోసం హోరాహోరీగా పోటీ పడ్డాయి.
చివరకు రూ.33 లక్షల భారీ ధరకు మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మను దక్కించుకుంది. మరో స్టాయర్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ కొనుగోలు చేసింది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు, బౌలర్ సీవీ మిలింద్‌ను రూ.17 లక్షలకు దక్కించుకుంది ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ. బ్యాటర్ పేరాల అమన్‌రావును రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది.
ఆల్ రౌండర్ తనయ్ త్యాగరాజన్‌ను రూ.11 లక్షలకు కొనుగోలు చేసింది రంగారెడ్డి రైజర్స్. తన్మయ్ అగర్వాల్‌ను రూ.8 లక్షలకు దక్కించుకుంది కరీంనగర్ డైమండ్స్. బ్యాటర్ బుద్ధి రాహుల్‌ను రూ.8 లక్షలకు కైవసం చేసుకుంది నల్గొండ నైట్స్. రాహుల్ రాయుడును రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది పాలమూరు స్ట్రయికర్స్. ఐకాన్ ఆటగాళ్ల కేటగిరీలో రాహుల్ సింగ్‌ను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
తెలంగాణలో తొలిసారిగా ఫ్రాంచైజీ ఆధారిత టీజీ20 లీగ్ నిర్వహణ...
లీగ్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు...
21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ...
HCA లో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు...
మహ్మద్ సిరాజ్ ,తిలక్ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణ....
సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్ కూడా వేలం బరిలో ఉన్నారు....
అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్‌తో పాటు హైదరాబాద్ యువ క్రికెటర్లు కూడా వేలంలో ఉన్నారు...
ప్రతి టీమ్ కు రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయింపు.
ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది ప్లేయర్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.
టీమ్ కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి.
వేలం ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీల వారీగా జరుగుతుంది.
గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహంగా ప్రతి టీమ్ లో కనీసం 4 జిల్లా ఆటగాళ్లు ఉండాలి...
ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం 2 జిల్లా ప్లేయర్స్ ఆడటం తప్పనిసరి.
మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు నేతృత్వంలోని టీమ్ ఓపెన్ ట్రయల్స్ నిర్వహించింది...
ప్రముఖ ఆక్షనీర్ చారు శర్మ వేలాన్ని నిర్వహించనున్నారు.
ప్లేయర్ల వేలం jiohotstar.com లో లైవ్ ప్రసారం..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లీగ్ ప్రధాన లక్ష్యం.
