నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. నన్ను చేస్తారంట.. హైదరాబాద్ గాంధీభవన్ లో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారంట.. ఉన్న ఏజెన్సీలు చాలవు అన్నట్లు.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వాడుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో ప్రచారానికి వచ్చిన సందర్భంలో.. రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. ఈ వీడియోను డీప్ ఫేక్ చేశారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు అమిత్ షా అన్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు, ఈసీకి కంప్లయింట్ చేసింది. 

సోషల్ మీడియాలో అమిత్ షా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన వీడియోలు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి రిలీజ్ అయ్యాయి అంటూ ఢిల్లీ పోలీసులు.. ఏకంగా హడావిడిగా హైదరాబాద్ వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీభవన్ కు వెళ్లి నోటీసులు ఇచ్చారు. 

ఈ నోటీసులపై.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నన్ను అరెస్ట్ చేస్తారంట.. ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది.