సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
  • తెలంగాణను సెమీకండక్టర్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతున్నాం
  • జర్మనీ-తెలంగాణ లాజిస్టిక్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహకరించండి
  • జీఐబీఏ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ (జీఐబీఏ) ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కోరారు. తెలంగాణను సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు  ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాక్ నగర మేయర్ మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రెడ్ ఓకెల్ నేతృత్వంలోని జీఐబీఏ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబును కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వారికి వివరించారు.

సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఆటోమేషన్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే కంపెనీలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధిలో పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జర్మనీ కంపెనీల అధునాతన సాంకేతికత, ప్రెసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను తెలంగాణలోని నైపుణ్యం ఉన్న యువత, పరిశ్రమల వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఎగుమతులకు లాజిస్టిక్ కారిడార్..

తెలంగాణ నుంచి జర్మనీ, ఇతర యూరప్ దేశాలకు ఎగుమతులు సులభంగా చేరేలా తెలంగాణ–-జర్మనీ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కోరారు. దీనివల్ల రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లలో మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’పై జర్మనీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని జీఐబీఏ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో జీఐబీఏ చైర్మన్ సెల్వకుమార్ పెరియసామి, సీఈవో నిర్మల్ రామన్ కన్నయ్యన్, ఇన్నోవేషన్ హబ్ రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిన్ సీఈవో స్టెఫాన్ విట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిండ్ట్, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.