19 నుంచి కేరళలో సీనియర్ జర్నలిస్టుల సమావేశాలు

19 నుంచి కేరళలో  సీనియర్ జర్నలిస్టుల సమావేశాలు
  •  ఐఎఫ్‌‌‌‌డబ్ల్యూజే కార్యదర్శి ఆనందం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు కేరళలోని త్రివేండ్రంలో  సీనియర్ జర్నలిస్టుల జాతీయ సమావేశాలు జరగనున్నాయి.ఈ విషయాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌‌‌‌డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

19న త్రివేండ్రం ప్రెస్ క్లబ్‌‌‌‌లో కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశాలను ప్రారంభిస్తారు. అదే రోజు ప్రముఖుల సంఘీభావ సమావేశం, అంతర్జాతీయ ఫొటో ప్రదర్శన జరుగుతాయి. 20, 21 తేదీల్లో ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి 250 మంది సీనియర్ జర్నలిస్టులు ప్రతినిధులుగా పాల్గొంటారు. తెలంగాణ వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుంచి కె.లక్ష్మణ్ రావు, పి.శ్రీనివాస్ రెడ్డి, ఉడయవర్లు, నందిరాజు రాధాకృష్ణ తదితరులు హాజరవుతారు.