డ్రగ్స్ రహిత సమాజం కావాలని పోలీసు ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈగల్ ఫోర్స్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాలేజీలు, స్కూళ్లలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. కూసుమంచి మండల కేంద్రంతోపాటు జీళ్లచెరువు, నర్సింహులగూడెం, నాయకన్‌గూడెం స్కూల్లో ఈగల్‌ఫోర్స్ డీఎస్పీ శివం నాయుడు, కారేపల్లి హైస్కూల్లో ఈగల్‌ఫోర్స్ డీఎస్పీ నర్సింగ్‌రావు అవగాహన కల్పించారు. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి, వీఎం బంజరు, లంకపల్లి గ్రామాల్లో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఈగల్ టీమ్ తో కలిసి సే నో టూ డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీఎం బంజరులో పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటుచేశారు. కొణిజర్ల తనికెళ్ల విజయ ఇంజినీరింగ్ కాలేజ్‌లో వైరా ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రసాద్డ్రగ్స్పై అవేర్నెస్కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మధిర మండల కేంద్రంతోపాటు సిరిపురం, దెందుకూరు గ్రామాల్లో ఖమ్మం ఏసీపీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అవగాహన కార్యమాలు నిర్వహించారు. -కూసుమంచి/ కారేపల్లి/ పెనుబల్లి/ కొణిజర్ల/ మధిర, వెలుగు
