బాయ్కాట్ రేవంత్.. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయం

బాయ్కాట్ రేవంత్.. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయం

రేవంత్ రెడ్డి టార్గెట్‭గా కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. కొత్తగా వచ్చినోళ్లకు కొత్త కమిటీల్లో 50శాతానికి పైగా పదవులు కల్పించారని మండిపడ్డారు. పైగా ఒర్జినల్ కాంగ్రెస్ లీడర్లను సోషల్ మీడియాలో బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసవచ్చినోళ్లకు.. ఒర్జినల్ కాంగ్రెస్ లీడర్లకే అసలు లొల్లి అని నేతలు అన్నారు. నాలుగు పార్టీలు మారొచ్చినాయిన పార్టీని ఉద్దరిస్తడా అంటూ మండిపడ్డారు. తమది నాలుగు పార్టీలు మారి వచ్చిన చరిత్ర కాదంటూ రేవంత్‭ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. కొత్త పీసీసీ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధిష్టానం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ చేశారు.

కాంగ్రెస్‭లో వివాదం మరింత ముదురుతోంది. రేవంత్‭ను బైకాట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు గాంధీభవన్‭లో PAC, PCC ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగనుంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లకు మెసెజ్‭లు వెళ్లాయి. ఈ మీటింగ్‭కు హాజరు కావొద్దని సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్లు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సీనియర్లు మళ్లీ భేటీ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.