
హైదరాబాద్: మహీంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఈ డ్రగ్స్ సరఫరా ముఠాల లక్ష్యంగా మారినట్టు పోలీసులు వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, మట్టి గాజులు, ఆయుర్వేద ఉత్పత్తుల వంటి సాధారణ వస్తువుల మధ్య హెరాయిన్, ఎఫిడ్రీస్ ప్యాకెట్లు దాచి పంపుతుస్నట్టు తేలింది. 'పుష్ప' సినిమా తరహాలో పుస్త కాలు, మెడిసిన్, గాజుల ముసుగులో డ్రగ్స్ ను కొరియర్ ద్వారా అక్రమంగా తరలించడాన్ని పోలీసులు గుర్తించారు.
మహీంద్ర యూనివ ర్సిటీకి చెందిన విద్యార్థులు, మారుతీ కొరియ ర్స్ ద్వారా 'ఓజీ గంజాయి' తెప్పించుకున్నట్టు తేల్చారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలకు డ్రగ్స్ తరచూ కొరియర్ పార్సిల్ రూపంలో చేరుతున్న ట్లు తెలుస్తోంది. అయితే గత రెండేండ్లలో 10కి పైగా కొరియర్ కంపెనీల ద్వారా సుమారు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొరియర్ సంస్థలు కమీషన్ ఆంచి డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తు న్నారు. ఈ కేసులో కొన్ని కొరియర్ సంస్థల పైనా కేసులు నమోదు చేశారు డ్రగ్స్ సరఫ రాబో వాటి పాత్రను నిర్ణీతంగా పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలో మరిన్ని అరెస్టులు చేసే అవకాశముందని తెలుస్తోంది.