కరోనా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

కరోనా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లను కరోనా భయం వీడటం లేదు. ఇవాళ కూడా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 10శాతం పడిపోయింది.  సెన్సెన్స్ 2992పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 842  పైగా పాయింట్లు నష్టపోయింది. దీంతో 45 నిముషాల పాటు  మార్కెట్ ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా భయమే మార్కెట్లను మింగేసిందని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. లాక్ డౌన్ కంటిన్యూ అవుతుండటంతో ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే ప్రమాదముందని ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. కరోనా మరణాలు పెరుగుతుండటం కూడా ఇన్వెస్టర్లను భయపెడుతోంది. దీంతో అమ్మకాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు.. చాలా కంపెనీలు ఉత్పత్తి నిలిపేయడంతో.. ఆయా సంస్థల ఆదాయమార్గాలు కూడా తగ్గిపోయాయి. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది.