సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్రా క్రీడాకారులకు సన్మానం

సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్రా క్రీడాకారులకు సన్మానం
  •     108 మంది చాంపియన్లకు అభినందనలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్రా క్రీడ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆదివారం విక్టరీ ప్లే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 మంది క్రీడాకారులకు భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 

రాష్ట్ర సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు, నేషనల్ జాయింట్ సెక్రటరీ పెరిక సురేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ నేత ఎన్. రాంచందర్ రావు, సెపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చంద్రకాంత్ బాబు కావ్లేకర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొలంబోలో జరిగిన దక్షిణాసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్వర్ణ పతకం అందించిన తెలంగాణ యువ క్రీడాకారుడు ఆకుల హరినాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతిథులు ఘనంగా సత్కరించారు.