ఆరోసారి ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన జకోవిచ్

ఆరోసారి ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన జకోవిచ్

సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను సాధించాడు. ఫైనల్లో మూడో సీడ్ క్యాస్పర్ రూడ్ను ఓడించి రికార్డు స్థాయిలో ఆరో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో మొదటి సెట్ను జకోవిచ్ 7-5తో దక్కించుకున్నాడు. తొలి సెట్ను గెలిచిన జకో..రెండో సెట్లో మరింత జోరును కొనసాగించి..6-3తో సెట్తో పాటు..మ్యాచును కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు. 

జకోవిచ్కు ఇది 6వ ఏటీపీ ఫైనల్ టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీ చరిత్రలో జకోవిచ్తో పాటు..ఫెదరర్ కూడా ఆరు సార్లు విజేతగా నిలిచాడు. ఇక 2015 తర్వాత జకోవిచ్ ఏటీపీ ఫైనల్స్  విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. గతంలో రెండు సార్లు ఫైనల్కు చేరుకున్నా..ఫైనల్లో మాత్రం ఓడిపోయాడు. అంతకుముందు  సెమీఫైనల్లో జకోవిచ్  7-6 (5), 7-6 (6)తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్ చేరాడు.