వ్యాక్సిన్ మిక్సింగ్ అనేది ఓ చెత్త ఐడియా

వ్యాక్సిన్ మిక్సింగ్ అనేది ఓ చెత్త ఐడియా

వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ సరికాదన్నారు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరస్ పూనవాలా. మిగ్సింగ్ ఐడియా ఓ చెత్త ఐడియా అని.. ఏదైనా తప్పు జరిగితే ఇద్దరు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య బ్లేమ్ గేమ్ మొదలవుతుందన్నారు. అవసరమైన సహకారం, పర్మిషన్ ప్రొత్సాహకం, గణనీయంగా తగ్గిన లైసన్స్ రాజ్  కారణంగానే వ్యాక్సిన్ ను తొందరగా లాంచ్ చేయగలిగామన్నారు సైరస్. లైసెన్స్ రాకుండా నోవావాక్స్  లాంచ్ చేయలేమని చెప్పారు సైరస్. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తో నోవావాక్స్ పేరెంట్ కంపెనీకి కొన్ని సమస్యలున్నాయన్నారు. అక్టోబర్ చివరినాటికి అవి పరిష్కారమవుతాయన్నారు సైరస్. అక్కడ లైసెన్స్ రాగానే ఇక్కడ కూడా కూడా లైసెన్స్ పొందుతామన్నారు.