జీడిమెట్లలో వీసాలు, పాస్‌పోర్టులు లేని ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

 జీడిమెట్లలో  వీసాలు, పాస్‌పోర్టులు లేని ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. ఎలాంటి వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు... గాజులరామారంలోని హెచ్ఏఎల్ కాలనీపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. అక్కడ ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న... ఏడుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా... ఎలాంటి చెల్లుబాటు అయ్యే వీసాలు కానీ, పాస్‌పోర్టులు కానీ... లేవని తేలింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే... వీరంతా భారత్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

ALSO READ : పంజాగుట్ట నిమ్స్లో లైంగిక దాడి కలకలం..

అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించిన వీరు... గతంలో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా తలదాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు... రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఏడుగురిని... మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు.