విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోట్లల్లో ముంచిన మొగుడూపెళ్లాం !

విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోట్లల్లో ముంచిన మొగుడూపెళ్లాం !

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతుల పై పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన భార్యాభర్తలు సౌజన్య , శ్రీనివాస్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు సీసీఎస్ పోలీసులను కోరారు.

బేగంపేటలో ఫ్లైయింగ్ బార్డర్స్ కన్సెల్టెన్సీ ఏర్పాటు చేసి , నిరుద్యోగులైన తమను టార్గెట్ చేశారని బాధితులు వాపోయారు. స్విట్జర్లాండ్ , ఐర్లాండ్ , నెదర్లాండ్ దేశాలలో స్కిల్డ్ బేస్డ్ మీద ఉద్యోగాలు కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 4 లక్షల నుంచి 14 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 వేల మంది వరకు బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసం చేసినందుకు విజయవాడ పోలీసులు భార్యభర్తలు సౌజన్య శ్రీనివాస్లను గత వారం అరెస్ట్ చేశారని , వారు ఇప్పుడు బెయిల్పై విడుదల అయ్యారని అన్నారు.

ALSO READ : పెను విషాదం.. టాటా సుమోపై విరిగి పడిన కొండ చరియలు

వారు బయటకు వచ్చిన తరువాత కూడా అమాయక యువతను మోసం చేస్తున్నారని తెలిపారు. కోట్లల్లో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని , తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.