పాక్ క్రికెటర్లు ఈ మద్య ఇండియాపై విషం కక్కుతున్నారు. ఇండియా సాంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.లేటెస్ట్ గా పాక్ మాజీ క్రికెటర్ ఆల్ రౌంటర్ షాహిద్ ఆఫ్రిది భారత సాంప్రదాయాల గురించి హేలన చేసే విధంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరు ఎప్పుడైనా టీవిని పగలగొట్టారా? అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తన భార్య కారణంగా టీవీ పగలగొట్టానని ఆఫ్రిది అన్నాడు. ‘ ఇంట్లో పిల్లలున్నప్పుడు నా భార్యను టీవీ చూడనివ్వను . అయితే ఒకసారి నా భార్య పిల్లలతో కలిసి టీవీ చూస్తుంది. షోలో చూస్తూ తన కూతురు హారతి ఇస్తుంది. అపుడు తాను టీవీ బద్దలు కొట్టాను‘ అని ఆఫ్రిది అన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆఫ్రిదిపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయాలపై ఆఫ్రిది తన వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

