కింగ్ ఖాన్ కొత్త మూవీ టీజర్

కింగ్ ఖాన్ కొత్త మూవీ టీజర్

అట్లీ..కోలీవుడ్ సంచలన దర్శకుడు.  అట్లీ- విజయ్తో కాంబోలో వచ్చిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెరి, మెర్సిల్, బిగిల్ సినిమాలతో అట్లీ సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఫస్ట్ టైం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో మూవీ చేస్తున్నాడు. జవాన్ పేరుతో తెరకెక్కుతున్న  మూవీ.. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా జవాన్ మూవీ టీజర్ విడుదల చేశారు.  

1 నిమిషం 30 సెకన్ల టీజర్లో షారుఖ్ గెటప్ను చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. ముఖానికి గుడ్డ చుట్టుకుంటూ...గన్ పట్టుకుని సాలిడ్గా కూర్చున్న స్టిల్ అదిరిపోయింది. షారుక్ గెటప్ చూస్తుంటే..మూవీలో అతని రోల్ అద్భుతంగా ఉండనుందని అర్థమవుతుంది. ఓ షెడ్లో తన మిషన్ను ప్రారంభించేందుకు వెయిట్ చేస్తున్న షారుఖ్కు..వాకీటాకీ ద్వారా ఇంటిమేషన్ రావడంతో..అతని ఆనందం..టీజర్లో చూపించారు. 

మొత్తంగా టీజర్ ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు డైరెక్టర్ అట్లీ. మరోసారి బిగ్ హిట్ను అట్లీ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయానికి వచ్చేశారు. ఇక  జవాన్ మూవీలో నయనతార హీరోయిన్.  సన్యా మల్హోత్రా, సునీల్‌ గ్రోవర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా..వచ్చే ఏడాది జూన్  02  సినిమా రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రం విడుదల చేయనున్నారు. 

షారుఖ్ ఖాన్ నటించిన జీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్, రయీస్, డియర్ జిందగీ, ఫ్యాన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. దీంతో బాద్షా జవాన్ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు.  ప్రస్తుతం జవాన్ తో పాటు.. పఠాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలతో హిట్లు కొట్టాలని అనుకుంటున్నాడు.  ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో తన పేరు మారుమ్రోగాలని ఆశపడుతున్న డైరెక్టర్  ఆట్లీకి..జవాన్ మంచి అవకాశంగా భావిస్తున్నాడు.