ఆర్టీసీ బస్సు ఢీకొని తమిళనాడు వాసి మృతి... శంషాబాద్ లో ఘటన

ఆర్టీసీ బస్సు ఢీకొని తమిళనాడు వాసి మృతి... శంషాబాద్ లో ఘటన

గండిపేట, వెలుగు: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంషాబాద్ ఇన్‌‌‌‌స్పెక్టర్ కె.నరేందర్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఎం.రామ్‌‌‌‌కుమార్​(43) డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న ట్రక్‌‌‌‌లో ప్యాకింగ్ కవర్లు లోడ్ చేసుకుని హైదరాబాద్‌‌‌‌కు వచ్చాడు. 17న రాత్రి గండిగూడ గ్రామ పరిధిలోని శ్రీతమిళనాడు లారీ ట్రాన్స్‌‌‌‌పోర్ట్స్ వద్ద సరుకు అన్‌‌‌‌లోడ్ చేసి అక్కడే ఉంటున్నాడు.