దమ్ముంటే సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలె:షర్మిల

దమ్ముంటే సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలె:షర్మిల

సీఎం కేసీఆర్​కు షర్మిల సవాల్​

హైదరాబాద్, వెలుగు: దమ్ముంటే సిట్టింగులకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని సీఎం కేసీఆర్​కు షర్మిల సవాల్ విసిరారు. మీరు, మీ ఎమ్మెల్యేలు సుద్దపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయండని కోరారు.  తొమ్మిదేండ్ల నుంచి అవినీతిని ఏరులై పారించి,  ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని ఆరోపించారు. కేసీఆర్​ తన కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని ఆదివారం ట్వీట్ లో ఫైర్ అయ్యారు.  ఇన్నాళ్లు కేసీఆర్​ దర్జాగా గడీల్లో ఉంటే ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప గట్టెక్కలేనని కేసీఆర్​ తెలుసుకున్నారని అన్నారు.