శ్రీకాంత్ త్యాగికి 14రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్టడీ

శ్రీకాంత్ త్యాగికి 14రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్టడీ

నోయిడాలో ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించిన కేసులో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే కోర్టుకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ త్యాగి ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. ఆ మహిళ తనకు సోదరిలాంటిదని చెప్పారు. రాజ‌కీయంగా తనను నిర్వీర్యం చేసేందుకే ఆమె తనతో అలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఈ సంఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా శ్రీకాంత్ త్యాగి కోర్టులో హాజరయ్యారు. ఆయనకు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్టడీని విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు... నోయిడాలోని సెక్టార్ 93లోని గ్రాండ్ ఓమాక్స్ హౌసింగ్ సొసైటీలోని ఆయన ఇంటిని కూల్చేశారు. ఈ నిర్మాణంపై స్థానికులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల అధికారులు తీసుకున్న చర్యలతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు.. మహిళతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో శ్రీకాంత్ త్యాగి ఆచూకీ తెలిపిన వారికి నోయిడా పోలీసులు రూ.25వేల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.