పార్టీలు ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నయ్: షియా ముస్లిం మత గురువు

పార్టీలు ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నయ్: షియా ముస్లిం మత గురువు

CAA, NRCలపై జరుగుతున్న నిరసనల విషయంలో పార్టీలను తప్పుబట్టారు షియా ముస్లిం మత గురువు, మజ్లిస్-ఏ-ఉలామా-ఏ-హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా కాల్బే జావాద్. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. లక్నోలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర రిజిస్టర్ (NRC) రెండూ పూర్తిగా ఒకదానికొకటి సంబంధలేని వేర్వేరు అంశాలని చెప్పారు మౌలానా జావాద్. రాజకీయ పార్టీలు వాటి స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింలు, యువతను కావాలని మిస్‌లీడ్ చేస్తున్నాయన్నారు. దయచేసి ముస్లింలు ఎటువంటి హింసకు పాల్పడకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారాయన. ప్రస్తుతానికి NRCని అస్సాంలో మాత్రమే అమలు చేస్తున్నారని, దేశమంతా దీన్ని తీసుకుని రాలేదని చెప్పారు. ఒకవేళ దేశమంతా NRCని తీసుకొస్తే ఎటువంటి రూల్స్, కండిషన్ ఉంటాయన్నది ఇంకా స్పష్టత లేదని అన్నారు. అనవసరంగా పొలిటికల్ పార్టీలు జనాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయని ఆరోపించారు.