బీసీ సంక్షేమ సంఘం అనుబంధంగా శివాజీ ఆర్మీ

బీసీ సంక్షేమ సంఘం అనుబంధంగా శివాజీ ఆర్మీ

ముషీరాబాద్, వెలుగు: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. యువతతోనే దేశ భవిత ముడిపడి ఉందని, డ్రగ్స్ నుంచి వారిని కాపాడటం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం అనుబంధంగా బీసీ శివాజీ ఆర్మీని ఏర్పాటు చేసి, దాని రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ ప్రవీణ్ కుమార్​ను నియమించారు. సోమవారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో జరిగిన ఆయనకు ర్యాగ అరుణ్ కుమార్​తో కలిసి నియామక పత్రం అందజేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, గంజాయి నిర్మూలనే శివాజీ ఆర్మీ ప్రధాన లక్ష్యమన్నారు.