V6 News

వైట్ హౌజ్ కు, నాకూ అసాధారణ భద్రత అవసరం: కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్

 వైట్ హౌజ్ కు, నాకూ  అసాధారణ భద్రత అవసరం: కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్

వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన కాల్పులపై ట్రంప్‌  విలేకరులతో మాట్లాడారు. దుండగుడి దగ్గర చాలా ఆయుధాలున్నాయి.. సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చాడు.. మా సీక్రెట్ సర్వీసెస్ అద్భుతంగా అడ్డుకున్నాయి. ఈ కాల్పులు ఘటన వైట్‌హౌస్‌ భద్రత పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది.. మునుపెన్నడు లేనటువంటి తనకు కూడా అసాధారణ భద్రత కావాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. తనపై దాడి ఇది తొలిసారి మాత్రమే కాదన్నారు ట్రంప్.  మరో 30 రోజుల్లో ఈ డిన్నర్‌మీట్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని చెప్పారు. 

దుండగుడి దగ్గర చాలా ఆయుధాలున్నాయి.. బహుశా హత్యాయత్నం చేసేందుకు వచ్చి ఉంటారు. అయితే మా సెక్యూరిటీ సిబ్బంది ధైర్యం, అద్బుతమైన  రెస్పాన్స్ ను ప్రదర్శించారు. వారికి ధన్యవాదాలు. మన రాజ్యాంగంపై  దుండగులు ఎలా దాడి చేశాడు. మన దేశం తరఫున సీక్రెట్ సర్వీస్ ఎంత వేగంగా స్పందించాయో చూపిస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తుంది" అని అధ్యక్షుడు జోడించారు.

భద్రతా చెక్‌పాయింట్ వైపు దూసుకెళ్లిన దుండగుడు ఓ అధికారిని గాయపరిచాడని చెప్పారు. అయితే ఆ అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడని ఆయన క్షేమంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు.

 వైట్ హౌజ్ భవనం.. అధికార, విపక్ష నేతలు, విలేకరులు ప్రముఖులు వచ్చిపోయే స్థలం. భద్రత లేని ప్రదేశం..ఈ ఘటన మరిన్ని రక్షణ చర్యలు అవసరమని నొక్కి చెపుతోంది.. వైట్ హౌస్‌లో సీక్రెట్ సర్వీస్ ,సైన్యం ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని ట్రంప్ అన్నారు.