హైదరాబాద్ వెలుగు: ఎలైట్ విమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ కోసం హైదరాబాద్‌లోని డ్రీమ్ బాస్కెట్‌బాల్ అకాడమీలో నిర్వహించిన ట్రై ఔట్స్(సెలెక్షన్ ట్రయల్స్)కు విశేష స్పందన వచ్చింది. లీగ్‌లో పోటీపడే ఆరు జట్లలో ఒకదానిలో చోటు దక్కించుకునేందుకు 250కి పైగా ఎంట్రీలు లభించాయి. ట్రై ఔట్స్‌లో సత్తా చాటిన 14 మంది యువతులను షార్ట్ లిస్ట్ చేశారు.
ఈ నెల 16 నుంచి 18 వరకు ముంబైలో, 23 నుంచి 25 వరకు కోల్‌కతాలో నిర్వహించే తదుపరి ట్రై ఔట్స్ తర్వాత ప్లేయర్లకు 5×5 ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో అవకాశం కల్పిస్తారు. దేశంలో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారని, ఈ లీగ్ దేశ వ్యాప్తంగా బాస్కెట్‌బాల్‌పై ప్రభావం చూపుతుందని లీగ్ సీఈవో సన్నీ భండార్కర్ తెలిపారు.

