విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన శ్రేయస్.. గిల్ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన శ్రేయస్.. గిల్ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్ ముంగిట  టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82) తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి సత్తా చాటాడు. 

 గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయ్యర్ ఆకట్టుకోవడంతో మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై 7 రన్స్ తేడాతో హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ముషీర్ ఖాన్ (73) రాణించడంతో 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలుత  ముంబై 299/3 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిమాచల్ 292 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. శివం దూబే నాలుగు వికెట్లు తీశాడు. ఈ విజయంతో ముంబై క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. మరోవైపు గోవాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున బరిలోకి దిగిన వన్డే టీమ్ కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (11) ఫెయిలయ్యాడు. అయినా  పంజాబ్  ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్–-సిలో అగ్రస్థానంలో నిలిచింది.