శ్రేయస్ అయ్యర్ కు ఫారిన్‌‌‌‌లో సర్జరీ!

శ్రేయస్ అయ్యర్ కు ఫారిన్‌‌‌‌లో సర్జరీ!

న్యూఢిల్లీ: ఇండియా బ్యాటర్‌‌‌‌, కేకేఆర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌  శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌16తో పాటు ఆస్ట్రేలియాతో జూన్‌‌‌‌లో జరిగే వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు దూరం కానున్నాడు. వెన్నుగాయానికి అతను ఫారిన్‌‌‌‌లో సర్జరీ చేయించుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

ఈ కారణంగా అతను ఐదు నెలలు ఆటకు దూరం కాబోతున్నాడు.  అక్టోబర్‌‌‌‌–నవంబర్‌‌‌‌లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పాల్గొనడం కూడా అనుమానంగా మారింది. వెన్నుగాయం తిరగబెట్టడంతో  గత నెల బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ నాలుగో టెస్టు నుంచి అతను వైదొలిగాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అతని ప్లేస్‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌ ఫ్రాంచైజీ నితీష్‌‌‌‌ రాణాకు కెప్టెన్సీ అప్పగించింది.