గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిరాక్ ఫీల్డింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో లంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ (14) ముందుకు వచ్చి ఆడిన షాట్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న గిల్ ఎడమవైపునకు గాల్లోకి లేచి (Full-stretch dive) అద్భుతంగా ఒంటి చేత్తో పట్టుకున్నాడు. బంతి నేలను తాకేందుకు కొద్ది అంగుళాల దూరంలో ఉన్నప్పుడు గిల్ ఒడిసిపట్టుకున్న ఈ ఫ్లయింగ్ క్యాచ్ చూసి లంక ఫ్యాన్స్ నివ్వెరపోయారు. బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయినా, ఈ మ్యాజికల్ క్యాచ్‌తో మ్యాచ్‌లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచిన గిల్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
462 రన్స్ కి భారత్ ఆలౌట్:
మూడో రోజు ఉదయం 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్, మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 462 పరుగులకు ఆలౌటైంది. అసిథ ఫెర్నాండో బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ చివరి వికెట్‌గా వెనుతిరిగినా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రీఎంట్రీలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన దేవదత్ పడిక్కల్ సాధించిన 167 పరుగుల భారీ ఇన్నింగ్స్ టీమిండియాకు బలమైన పునాది వేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న గాలే పిచ్‌పై 462 పరుగులు సాధించడంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.
లంక టాప్ ఆర్డర్ క్రాష్:
భారత్ పెట్టిన భారీ స్కోరుకు ఛేదించే క్రమంలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఇండియన్ బౌలర్లు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన పదునైన బంతులతో లంక బ్యాటర్లను తిప్పలు పెడుతూ వరుసగా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రవింద్ర జడేజా తలో ఒక వికెట్ తీసి లంక టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై లంక బ్యాటర్లు డిఫెన్స్ ఆడటానికే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
99 రన్స్కే 5 కీలక వికెట్లు డౌన్:
సుతార్, కుల్దీప్, జడేజా స్పిన్ ధాటికి తోడు గిల్ పట్టిన కిరాక్ క్యాచ్‌తో కమిందు మెండిస్ కూడా పెవిలియన్ చేరడంతో శ్రీలంక లంచ్ సమయానికి 99 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గాలే ట్రాక్ మూడో రోజు నుంచే పూర్తిగా స్పిన్నర్లకి స్వర్గధామంగా మారిపోవడంతో శ్రీలంకకు పెను సవాలుగా మారింది. కొండంత స్కోరు ఆధిక్యంతో ఉన్న భారత్ జట్టు, శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది.
Shubman Gill The Fielder Never Disappoints 🔥🔥 what a fire catch 🔥🔥🤌🤌#shubmangill#indvssl pic.twitter.com/8WrM8vlXi8
— Shubman Gill Parody (@Shubmanforever) August 17, 2026
