V6 News

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ అండర్‌‌‌‌‑19 గర్ల్స్‌‌‌‌లో.. టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌తో తస్నిమ్‌‌‌‌‌‌ రికార్డు

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ అండర్‌‌‌‌‑19 గర్ల్స్‌‌‌‌లో..  టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌తో తస్నిమ్‌‌‌‌‌‌  రికార్డు

న్యూఢిల్లీ: ఇండియా యంగ్‌‌‌‌ షట్లర్‌‌‌‌ తస్నిమ్‌‌‌‌ మీర్‌‌‌‌  వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ అందుకుంది. బుధవారం రిలీజ్‌‌‌‌ అయిన బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌ అండర్‌‌‌‌–19 గర్ల్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచి ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్‌‌‌‌గా రికార్డు సృష్టించింది. గుజరాత్‌‌‌‌కు చెందిన 16 ఏళ్ల తస్నిమ్‌‌‌‌ గతేడాది మూడు జూనియర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీల్లో టైటిల్స్‌‌‌‌ నెగ్గింది. దాంతో, జూనియర్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో మూడు ప్లేస్‌‌‌‌లు ఇంప్రూవ్‌‌‌‌ చేసుకొని టాప్‌‌‌‌ పొజిషన్‌‌‌‌కు చేరుకుంది. స్టార్‌‌‌‌ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌‌‌ సహా గర్ల్స్‌‌‌‌ కేటగిరీలో మరే ఇండియన్‌‌‌‌ షట్లర్‌‌‌‌ ఈ రికార్డు సాధించలేదు. సింధు వరల్డ్‌‌‌‌ నం. 2 ర్యాంక్‌‌‌‌ వరకూ రాగలిగింది. బాయ్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో మాత్రం  లక్ష్యసేన్‌‌‌‌, సిరిల్‌‌‌‌ వర్మ, ఆదిత్య జోషీ టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ అందుకున్నారు.