ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన

ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. 1600, 800 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పరిష్కార పోరాట సమితి ఆధ్వర్యంలో మహిళా అభ్యర్థులు వినూత్నంగా ముగ్గులు వేసి నిరసన తెలిపారు. 

2022 పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుళ్ల భర్తీ నోటిఫికేషన్ లో మార్పులు చేశారని, తాము మొదటి నుండి ఆ మార్పులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మార్పులను సవరించి..తమకు ప్రభుత్వం న్యాయం చేసేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.