భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని చర్ల మండలం బక్కచింతలపాడు గిరిజన గ్రామంలో ఎస్సై నర్సిరెడ్డి తన బాల్యమిత్రుల సహకారంతో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన స్కూల్ భవనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం ప్రారంభించారు.
చర్ల ఎస్సై నర్సిరెడ్డి తన బాల్యమిత్రులు పీవీ నర్సింహారెడ్డి, పి.రామారావు, పి.కార్తీక్, టి.హర్ష, ఈ.రాజేశ్, టి.శశిధర్ రెడ్డి, పి.రమణారెడ్డి, ఎం.సంతోష్ గౌడ్ సహకారంతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీఎస్పీ అరుణ్‌కుమార్, చర్ల సీఐ రాజువర్మ పాల్గొన్నారు.
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ఆదివాసీలు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని ఎస్పీ రోహిత్ రాజ్ కోరారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టేషనరీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మిడియం లక్ష్మి పాల్గొన్నారు.
