- మంత్రి వివేక్‌ను కోరిన లీడర్ అంజిరెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: 35 ఏండ్లుగా సిద్దిపేట రూరల్ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి .. ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. ఆదివారం ఇన్‌చార్జి మంత్రి వివేక్ సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో అంజిరెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేసిన తాను, మదన్ మోహన్ కాలం నుంచి పూజల హరికృష్ణ వరకు ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశానన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కాంగ్రెస్ జెండాను విడిచిపెట్టలేదని బావోద్వేగానికి గురయ్యారు. పార్టీకి చేసిన సేవలు, అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగాఆయన కోరారు.

