సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో శనివారం నిర్వహించిన ‘సిద్దిపేట ప్రోమో రన్’ ఉత్సాహంగా సాగింది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి 10 కిలోమీటర్ల రన్‌ను ప్రారంభించారు.
నగరంలోని ప్రధాన వీధుల మీదుగా రన్ కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతిరోజూ వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. జూన్ 7న హైదరాబాద్‌లో జరగనున్న ‘అవంతిక తెలంగాణ రన్’కు ప్రోమోగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
